Surah Al-Kafiroon - Telugu Translation by Abdul Raheem Mohammad Moulana
قُلۡ يَـٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా
Surah Al-Kafiroon, Verse 1
لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను
Surah Al-Kafiroon, Verse 2
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు
Surah Al-Kafiroon, Verse 3
وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను
Surah Al-Kafiroon, Verse 4
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు
Surah Al-Kafiroon, Verse 5
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు
Surah Al-Kafiroon, Verse 6