Surah Al-Isra Verse 69 - Telugu Translation by Abdul Raheem Mohammad Moulana
Surah Al-Israأَمۡ أَمِنتُمۡ أَن يُعِيدَكُمۡ فِيهِ تَارَةً أُخۡرَىٰ فَيُرۡسِلَ عَلَيۡكُمۡ قَاصِفٗا مِّنَ ٱلرِّيحِ فَيُغۡرِقَكُم بِمَا كَفَرۡتُمۡ ثُمَّ لَا تَجِدُواْ لَكُمۡ عَلَيۡنَا بِهِۦ تَبِيعٗا
లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము