Surah Aal-e-Imran Verse 167 - Telugu Translation by Abdul Raheem Mohammad Moulana
Surah Aal-e-Imranوَلِيَعۡلَمَ ٱلَّذِينَ نَافَقُواْۚ وَقِيلَ لَهُمۡ تَعَالَوۡاْ قَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ أَوِ ٱدۡفَعُواْۖ قَالُواْ لَوۡ نَعۡلَمُ قِتَالٗا لَّٱتَّبَعۡنَٰكُمۡۗ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ أَقۡرَبُ مِنۡهُمۡ لِلۡإِيمَٰنِۚ يَقُولُونَ بِأَفۡوَٰهِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يَكۡتُمُونَ
మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!" అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు