Surah Sad - Telugu Translation by Abdul Raheem Mohammad Moulana
صٓۚ وَٱلۡقُرۡءَانِ ذِي ٱلذِّكۡرِ
సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా
Surah Sad, Verse 1
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ فِي عِزَّةٖ وَشِقَاقٖ
వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు
Surah Sad, Verse 2
كَمۡ أَهۡلَكۡنَا مِن قَبۡلِهِم مِّن قَرۡنٖ فَنَادَواْ وَّلَاتَ حِينَ مَنَاصٖ
వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది
Surah Sad, Verse 3
وَعَجِبُوٓاْ أَن جَآءَهُم مُّنذِرٞ مِّنۡهُمۡۖ وَقَالَ ٱلۡكَٰفِرُونَ هَٰذَا سَٰحِرٞ كَذَّابٌ
మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇతడు మాంత్రికుడు, అసత్యవాది
Surah Sad, Verse 4
أَجَعَلَ ٱلۡأٓلِهَةَ إِلَٰهٗا وَٰحِدًاۖ إِنَّ هَٰذَا لَشَيۡءٌ عُجَابٞ
ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం
Surah Sad, Verse 5
وَٱنطَلَقَ ٱلۡمَلَأُ مِنۡهُمۡ أَنِ ٱمۡشُواْ وَٱصۡبِرُواْ عَلَىٰٓ ءَالِهَتِكُمۡۖ إِنَّ هَٰذَا لَشَيۡءٞ يُرَادُ
మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది
Surah Sad, Verse 6
مَا سَمِعۡنَا بِهَٰذَا فِي ٱلۡمِلَّةِ ٱلۡأٓخِرَةِ إِنۡ هَٰذَآ إِلَّا ٱخۡتِلَٰقٌ
ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే
Surah Sad, Verse 7
أَءُنزِلَ عَلَيۡهِ ٱلذِّكۡرُ مِنۢ بَيۡنِنَاۚ بَلۡ هُمۡ فِي شَكّٖ مِّن ذِكۡرِيۚ بَل لَّمَّا يَذُوقُواْ عَذَابِ
ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు
Surah Sad, Verse 8
أَمۡ عِندَهُمۡ خَزَآئِنُ رَحۡمَةِ رَبِّكَ ٱلۡعَزِيزِ ٱلۡوَهَّابِ
లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా
Surah Sad, Verse 9
أَمۡ لَهُم مُّلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۖ فَلۡيَرۡتَقُواْ فِي ٱلۡأَسۡبَٰبِ
లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను
Surah Sad, Verse 10
جُندٞ مَّا هُنَالِكَ مَهۡزُومٞ مِّنَ ٱلۡأَحۡزَابِ
ఇంతకు ముందు ఓడించబడిన సైన్యాల వలే, ఒక వర్గం వీరిది కూడా ఉంటుంది
Surah Sad, Verse 11
كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَعَادٞ وَفِرۡعَوۡنُ ذُو ٱلۡأَوۡتَادِ
వీరికి పూర్వం నూహ్ మరియు ఆద్ (జాతి) వారు మరియు మేకుల ఫిర్ఔన్ జాతుల వారు సత్యాన్ని తిరస్కరించారు
Surah Sad, Verse 12
وَثَمُودُ وَقَوۡمُ لُوطٖ وَأَصۡحَٰبُ لۡـَٔيۡكَةِۚ أُوْلَـٰٓئِكَ ٱلۡأَحۡزَابُ
మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే
Surah Sad, Verse 13
إِن كُلٌّ إِلَّا كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ عِقَابِ
ఇక వీరిలో ఏ ఒక్కరూ ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించకుండా ఉండలేదు, కావున నా శిక్ష అనివార్యమయ్యింది
Surah Sad, Verse 14
وَمَا يَنظُرُ هَـٰٓؤُلَآءِ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ مَّا لَهَا مِن فَوَاقٖ
మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (సయ్ హా) కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు
Surah Sad, Verse 15
وَقَالُواْ رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبۡلَ يَوۡمِ ٱلۡحِسَابِ
మరియు వారు: "ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చి వెయ్యి." అని అంటారు
Surah Sad, Verse 16
ٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَٱذۡكُرۡ عَبۡدَنَا دَاوُۥدَ ذَا ٱلۡأَيۡدِۖ إِنَّهُۥٓ أَوَّابٌ
(ఓ ముహమ్మద్!) వారి మాటల యెడల నీవు సహనం వహించు మరియు బలవంతుడైన, మా దాసుడు దావూద్ ను జ్ఞాపకం చేసుకో. నిశ్చయంగా, అతను ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలుతూ ఉండేవాడు
Surah Sad, Verse 17
إِنَّا سَخَّرۡنَا ٱلۡجِبَالَ مَعَهُۥ يُسَبِّحۡنَ بِٱلۡعَشِيِّ وَٱلۡإِشۡرَاقِ
నిశ్చయంగా, మేము పర్వతాలను అతనితో బాటు సాయంత్రం మరియు ఉదయం మా పవిత్రతను కొనియాడుతూ ఉండేటట్లు చేశాము
Surah Sad, Verse 18
وَٱلطَّيۡرَ مَحۡشُورَةٗۖ كُلّٞ لَّهُۥٓ أَوَّابٞ
మరియు పక్షులు కూడా గుమికూడేవి. అంతా కలసి ఆయన (అల్లాహ్) వైపుకు మరలేవారు
Surah Sad, Verse 19
وَشَدَدۡنَا مُلۡكَهُۥ وَءَاتَيۡنَٰهُ ٱلۡحِكۡمَةَ وَفَصۡلَ ٱلۡخِطَابِ
మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు చేయడంలో, నేర్పరితనాన్ని ప్రసాదించాము
Surah Sad, Verse 20
۞وَهَلۡ أَتَىٰكَ نَبَؤُاْ ٱلۡخَصۡمِ إِذۡ تَسَوَّرُواْ ٱلۡمِحۡرَابَ
మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరి వార్త నీకు చేరిందా? వారు గోడ ఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు
Surah Sad, Verse 21
إِذۡ دَخَلُواْ عَلَىٰ دَاوُۥدَ فَفَزِعَ مِنۡهُمۡۖ قَالُواْ لَا تَخَفۡۖ خَصۡمَانِ بَغَىٰ بَعۡضُنَا عَلَىٰ بَعۡضٖ فَٱحۡكُم بَيۡنَنَا بِٱلۡحَقِّ وَلَا تُشۡطِطۡ وَٱهۡدِنَآ إِلَىٰ سَوَآءِ ٱلصِّرَٰطِ
వారు దావూద్ వద్దకు వచ్చినపుడు, అతను వారిని చూసి బెదిరి పోయాడు. వారన్నారు: "భయపడకు! మేమిద్దరం ప్రత్యర్థులం, మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. మరియు నీతి మీరి నడువకు, మాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి
Surah Sad, Verse 22
إِنَّ هَٰذَآ أَخِي لَهُۥ تِسۡعٞ وَتِسۡعُونَ نَعۡجَةٗ وَلِيَ نَعۡجَةٞ وَٰحِدَةٞ فَقَالَ أَكۡفِلۡنِيهَا وَعَزَّنِي فِي ٱلۡخِطَابِ
వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా దగ్గర కేవలం ఒకే ఒక్క ఆడ గొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: 'దీనిని నాకివ్వు.' మరియు తన మాటల నేర్పులోత నన్ను వశపరచుకుంటున్నాడు
Surah Sad, Verse 23
قَالَ لَقَدۡ ظَلَمَكَ بِسُؤَالِ نَعۡجَتِكَ إِلَىٰ نِعَاجِهِۦۖ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡخُلَطَآءِ لَيَبۡغِي بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ وَقَلِيلٞ مَّا هُمۡۗ وَظَنَّ دَاوُۥدُ أَنَّمَا فَتَنَّـٰهُ فَٱسۡتَغۡفَرَ رَبَّهُۥ وَخَرَّۤ رَاكِعٗاۤ وَأَنَابَ۩
(దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరి కొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!" వాస్తవానికి మేము అతనిని (దావూద్ ను) పరీక్షిస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడుకున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలాడు
Surah Sad, Verse 24
فَغَفَرۡنَا لَهُۥ ذَٰلِكَۖ وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلۡفَىٰ وَحُسۡنَ مَـَٔابٖ
అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి
Surah Sad, Verse 25
يَٰدَاوُۥدُ إِنَّا جَعَلۡنَٰكَ خَلِيفَةٗ فِي ٱلۡأَرۡضِ فَٱحۡكُم بَيۡنَ ٱلنَّاسِ بِٱلۡحَقِّ وَلَا تَتَّبِعِ ٱلۡهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ ٱللَّهِۚ إِنَّ ٱلَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ ٱللَّهِ لَهُمۡ عَذَابٞ شَدِيدُۢ بِمَا نَسُواْ يَوۡمَ ٱلۡحِسَابِ
(మేము అతనితో ఇలా అన్నాము): "ఓ దావూద్! నిశ్చయంగా, మేము నిన్ను భూమిలో ఉత్తరాధికారిగా నియమించాము. కావున నీవు ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి మరియు నీ మనోకాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి." నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారో, వారికి లెక్క దినమున మరచి పోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది
Surah Sad, Verse 26
وَمَا خَلَقۡنَا ٱلسَّمَآءَ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا بَٰطِلٗاۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُواْۚ فَوَيۡلٞ لِّلَّذِينَ كَفَرُواْ مِنَ ٱلنَّارِ
మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది
Surah Sad, Verse 27
أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ
ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా
Surah Sad, Verse 28
كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ
(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని
Surah Sad, Verse 29
وَوَهَبۡنَا لِدَاوُۥدَ سُلَيۡمَٰنَۚ نِعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٌ
మరియు మేము దావూద్ కు సులైమాన్ ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లప్పుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు
Surah Sad, Verse 30
إِذۡ عُرِضَ عَلَيۡهِ بِٱلۡعَشِيِّ ٱلصَّـٰفِنَٰتُ ٱلۡجِيَادُ
ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడి గల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు
Surah Sad, Verse 31
فَقَالَ إِنِّيٓ أَحۡبَبۡتُ حُبَّ ٱلۡخَيۡرِ عَن ذِكۡرِ رَبِّي حَتَّىٰ تَوَارَتۡ بِٱلۡحِجَابِ
అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు
Surah Sad, Verse 32
رُدُّوهَا عَلَيَّۖ فَطَفِقَ مَسۡحَۢا بِٱلسُّوقِ وَٱلۡأَعۡنَاقِ
(అతను ఇంకా ఇలా అన్నాడు): "వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి." తరువాత అతను వాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు
Surah Sad, Verse 33
وَلَقَدۡ فَتَنَّا سُلَيۡمَٰنَ وَأَلۡقَيۡنَا عَلَىٰ كُرۡسِيِّهِۦ جَسَدٗا ثُمَّ أَنَابَ
మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు
Surah Sad, Verse 34
قَالَ رَبِّ ٱغۡفِرۡ لِي وَهَبۡ لِي مُلۡكٗا لَّا يَنۢبَغِي لِأَحَدٖ مِّنۢ بَعۡدِيٓۖ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ
అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు
Surah Sad, Verse 35
فَسَخَّرۡنَا لَهُ ٱلرِّيحَ تَجۡرِي بِأَمۡرِهِۦ رُخَآءً حَيۡثُ أَصَابَ
అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది
Surah Sad, Verse 36
وَٱلشَّيَٰطِينَ كُلَّ بَنَّآءٖ وَغَوَّاصٖ
మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము)
Surah Sad, Verse 37
وَءَاخَرِينَ مُقَرَّنِينَ فِي ٱلۡأَصۡفَادِ
మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి
Surah Sad, Verse 38
هَٰذَا عَطَآؤُنَا فَٱمۡنُنۡ أَوۡ أَمۡسِكۡ بِغَيۡرِ حِسَابٖ
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు
Surah Sad, Verse 39
وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلۡفَىٰ وَحُسۡنَ مَـَٔابٖ
మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్నిహిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి
Surah Sad, Verse 40
وَٱذۡكُرۡ عَبۡدَنَآ أَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلشَّيۡطَٰنُ بِنُصۡبٖ وَعَذَابٍ
మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: "నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు
Surah Sad, Verse 41
ٱرۡكُضۡ بِرِجۡلِكَۖ هَٰذَا مُغۡتَسَلُۢ بَارِدٞ وَشَرَابٞ
(మేము అతనితో అన్నాము): "నీ కాలును నేల మీద కొట్టు. అదిగో చల్ల (నీటి చెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను
Surah Sad, Verse 42
وَوَهَبۡنَا لَهُۥٓ أَهۡلَهُۥ وَمِثۡلَهُم مَّعَهُمۡ رَحۡمَةٗ مِّنَّا وَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ
మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుద్ధిమంతులకు ఇది ఒక హితబోధ
Surah Sad, Verse 43
وَخُذۡ بِيَدِكَ ضِغۡثٗا فَٱضۡرِب بِّهِۦ وَلَا تَحۡنَثۡۗ إِنَّا وَجَدۡنَٰهُ صَابِرٗاۚ نِّعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٞ
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు
Surah Sad, Verse 44
وَٱذۡكُرۡ عِبَٰدَنَآ إِبۡرَٰهِيمَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ أُوْلِي ٱلۡأَيۡدِي وَٱلۡأَبۡصَٰرِ
మరియు మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూరదృష్టి గలవారు
Surah Sad, Verse 45
إِنَّآ أَخۡلَصۡنَٰهُم بِخَالِصَةٖ ذِكۡرَى ٱلدَّارِ
నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన
Surah Sad, Verse 46
وَإِنَّهُمۡ عِندَنَا لَمِنَ ٱلۡمُصۡطَفَيۡنَ ٱلۡأَخۡيَارِ
మరియు నిశ్చయంగా, మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన ఉత్తమ (పుణ్య) పురుషులలోని వారు
Surah Sad, Verse 47
وَٱذۡكُرۡ إِسۡمَٰعِيلَ وَٱلۡيَسَعَ وَذَا ٱلۡكِفۡلِۖ وَكُلّٞ مِّنَ ٱلۡأَخۡيَارِ
మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు
Surah Sad, Verse 48
هَٰذَا ذِكۡرٞۚ وَإِنَّ لِلۡمُتَّقِينَ لَحُسۡنَ مَـَٔابٖ
ఇది ఒక ప్రస్తావన. మరియు నిశ్చయంగా! దైవభీతి గలవారికి ఉత్తమ గమ్యస్థానం ఉంది
Surah Sad, Verse 49
جَنَّـٰتِ عَدۡنٖ مُّفَتَّحَةٗ لَّهُمُ ٱلۡأَبۡوَٰبُ
శాశ్వతమైన స్వర్గవనాలు, వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి
Surah Sad, Verse 50
مُتَّكِـِٔينَ فِيهَا يَدۡعُونَ فِيهَا بِفَٰكِهَةٖ كَثِيرَةٖ وَشَرَابٖ
అందులో వారు దిండ్లను ఆనుకొని కూర్చొని; అందులో వారు అనేక ఫలాలను మరియు పానీయాలను అడుగుతూ ఉంటారు
Surah Sad, Verse 51
۞وَعِندَهُمۡ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ أَتۡرَابٌ
మరియు వారి దగ్గర సమవయస్కులు మరియు తమ చూపులను వారి కొరకే ప్రత్యేకించుకొనే శీలవతులైన స్త్రీలు ఉంటారు
Surah Sad, Verse 52
هَٰذَا مَا تُوعَدُونَ لِيَوۡمِ ٱلۡحِسَابِ
లెక్కదినం కొరకు మీతో (దైవభీతి గలవారితో) చేయబడిన వాగ్దానం ఇదే
Surah Sad, Verse 53
إِنَّ هَٰذَا لَرِزۡقُنَا مَا لَهُۥ مِن نَّفَادٍ
నిశ్చయంగా, ఇదే మేమిచ్చే జీవనోపాధి. దానికి తరుగులేదు
Surah Sad, Verse 54
هَٰذَاۚ وَإِنَّ لِلطَّـٰغِينَ لَشَرَّ مَـَٔابٖ
ఇదే (విశ్వాసులకు లభించేది). మరియు నిశ్చయంగా, తలబిరుసుతనం గల దుష్టులకు అతి చెడ్డ గమ్యస్థానం ఉంటుంది
Surah Sad, Verse 55
جَهَنَّمَ يَصۡلَوۡنَهَا فَبِئۡسَ ٱلۡمِهَادُ
నరకం - వారందులో కాలుతారు. ఎంత బాధాకరమైన విరామ (నివాస) స్థలము
Surah Sad, Verse 56
هَٰذَا فَلۡيَذُوقُوهُ حَمِيمٞ وَغَسَّاقٞ
ఇదే (దుష్టులకు లభించేది), కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము
Surah Sad, Verse 57
وَءَاخَرُ مِن شَكۡلِهِۦٓ أَزۡوَٰجٌ
ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి
Surah Sad, Verse 58
هَٰذَا فَوۡجٞ مُّقۡتَحِمٞ مَّعَكُمۡ لَا مَرۡحَبَۢا بِهِمۡۚ إِنَّهُمۡ صَالُواْ ٱلنَّارِ
ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు
Surah Sad, Verse 59
قَالُواْ بَلۡ أَنتُمۡ لَا مَرۡحَبَۢا بِكُمۡۖ أَنتُمۡ قَدَّمۡتُمُوهُ لَنَاۖ فَبِئۡسَ ٱلۡقَرَارُ
(సత్యతిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: "అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చిన వారు మీరే కదా! ఎంత చెడ్డ నివాస స్థలము
Surah Sad, Verse 60
قَالُواْ رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَٰذَا فَزِدۡهُ عَذَابٗا ضِعۡفٗا فِي ٱلنَّارِ
వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు
Surah Sad, Verse 61
وَقَالُواْ مَا لَنَا لَا نَرَىٰ رِجَالٗا كُنَّا نَعُدُّهُم مِّنَ ٱلۡأَشۡرَارِ
ఇంకా వారు ఇలా అంటారు: "మాకేమయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి
Surah Sad, Verse 62
أَتَّخَذۡنَٰهُمۡ سِخۡرِيًّا أَمۡ زَاغَتۡ عَنۡهُمُ ٱلۡأَبۡصَٰرُ
మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా
Surah Sad, Verse 63
إِنَّ ذَٰلِكَ لَحَقّٞ تَخَاصُمُ أَهۡلِ ٱلنَّارِ
నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు
Surah Sad, Verse 64
قُلۡ إِنَّمَآ أَنَا۠ مُنذِرٞۖ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు
Surah Sad, Verse 65
رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلۡعَزِيزُ ٱلۡغَفَّـٰرُ
ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు
Surah Sad, Verse 66
قُلۡ هُوَ نَبَؤٌاْ عَظِيمٌ
వారితో అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం
Surah Sad, Verse 67
أَنتُمۡ عَنۡهُ مُعۡرِضُونَ
దాని నుండి మీరు విముఖులవు తున్నారు
Surah Sad, Verse 68
مَا كَانَ لِيَ مِنۡ عِلۡمِۭ بِٱلۡمَلَإِ ٱلۡأَعۡلَىٰٓ إِذۡ يَخۡتَصِمُونَ
(ఓ ముహమ్మద్! ఇలా అను): "ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు
Surah Sad, Verse 69
إِن يُوحَىٰٓ إِلَيَّ إِلَّآ أَنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٌ
కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే
Surah Sad, Verse 70
إِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَـٰٓئِكَةِ إِنِّي خَٰلِقُۢ بَشَرٗا مِّن طِينٖ
నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను
Surah Sad, Verse 71
فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ
ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి
Surah Sad, Verse 72
فَسَجَدَ ٱلۡمَلَـٰٓئِكَةُ كُلُّهُمۡ أَجۡمَعُونَ
అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు
Surah Sad, Verse 73
إِلَّآ إِبۡلِيسَ ٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ
ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలో కలిసి పోయాడు
Surah Sad, Verse 74
قَالَ يَـٰٓإِبۡلِيسُ مَا مَنَعَكَ أَن تَسۡجُدَ لِمَا خَلَقۡتُ بِيَدَيَّۖ أَسۡتَكۡبَرۡتَ أَمۡ كُنتَ مِنَ ٱلۡعَالِينَ
(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా
Surah Sad, Verse 75
قَالَ أَنَا۠ خَيۡرٞ مِّنۡهُ خَلَقۡتَنِي مِن نَّارٖ وَخَلَقۡتَهُۥ مِن طِينٖ
(ఇబ్లీస్) అన్నాడు: "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు
Surah Sad, Verse 76
قَالَ فَٱخۡرُجۡ مِنۡهَا فَإِنَّكَ رَجِيمٞ
(అల్లాహ్) అన్నాడు: "ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు
Surah Sad, Verse 77
وَإِنَّ عَلَيۡكَ لَعۡنَتِيٓ إِلَىٰ يَوۡمِ ٱلدِّينِ
మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది
Surah Sad, Verse 78
قَالَ رَبِّ فَأَنظِرۡنِيٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ
(అప్పుడు ఇబ్లీస్) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు
Surah Sad, Verse 79
قَالَ فَإِنَّكَ مِنَ ٱلۡمُنظَرِينَ
(అల్లాహ్) సెలవిచ్చాడు: "సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది
Surah Sad, Verse 80
إِلَىٰ يَوۡمِ ٱلۡوَقۡتِ ٱلۡمَعۡلُومِ
ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు
Surah Sad, Verse 81
قَالَ فَبِعِزَّتِكَ لَأُغۡوِيَنَّهُمۡ أَجۡمَعِينَ
(ఇబ్లీస్) అన్నాడు: "నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను
Surah Sad, Verse 82
إِلَّا عِبَادَكَ مِنۡهُمُ ٱلۡمُخۡلَصِينَ
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప
Surah Sad, Verse 83
قَالَ فَٱلۡحَقُّ وَٱلۡحَقَّ أَقُولُ
(అల్లాహ్) అన్నాడు: "అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను
Surah Sad, Verse 84
لَأَمۡلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنۡهُمۡ أَجۡمَعِينَ
నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను
Surah Sad, Verse 85
قُلۡ مَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٖ وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُتَكَلِّفِينَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను
Surah Sad, Verse 86
إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ
ఇది (ఈ ఖుర్ఆన్) సమస్త లోకాల వారందరికీ కేవలం ఒక జ్ఞాపిక (హితబోధ)
Surah Sad, Verse 87
وَلَتَعۡلَمُنَّ نَبَأَهُۥ بَعۡدَ حِينِۭ
మరియు అచిర కాలంలోనే దీని ఉద్దేశాన్ని (వార్తను) మీరు తప్పక తెలుసుకుంటారు
Surah Sad, Verse 88